భారత్ ఓడిపోయిందని... బంగ్లాదేశ్ అభిమాని ఆత్మహత్య..

 

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక భారత్ ఓడినందుకు టీమిండియాపై అభిమానులు ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇక టీమిండియా ఓడినందుకు ఒక అభిమాని ఏకంగా ఆత్మహత్యే చేసుకున్నాడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..నిన్న మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఢాకాకు చెందిన బిద్యుత్(25) అనే అభిమాని వేగంగా వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu