రవిశాస్త్రికి మోడీ కౌంటర్..
posted on Mar 17, 2017 3:31PM
.jpg)
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ కూడా చేశారు. అయితే అందరి ట్వీట్స్ ఏమో కానీ.. మాజీ క్రికెటర్ రవిశాస్త్రి చేసిన ట్వీట్ కు మోడీ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ రవిశాస్త్రి ఏం ట్వీట్ చేశాడనుకుంటున్నారా..? అందులో ఏముంది అనుకుంటున్నారా..అసలు సంగతేంటంటే... రవిశాస్త్రి తన క్రికెట్ కామెంటరీ స్టైల్‌లో ప్రధాని మోదీ, భాజపాకు అభినందనలు తెలిపారు.
‘‘భాజపాకు అభినందనలు. ప్రధాని మోదీ, అమిత్‌షా ద్వయం ‘ఓ ట్రేసర్ బులెట్’లా దూసుకెళ్లి యూపీలో 300లకు పైగా సీట్లు సాధించారు’’ అని ట్వీట్ చేశారు. దీనికి గాను మోడీ స్పందించి... ‘నిజమైన విన్నర్ క్రికెట్(క్రికెట్ ఈజ్ ది రియల్ విన్నర్)’ పదాన్ని తీసుకుని.. ‘యూపీలో నిజమైన విన్నర్ ప్రజాస్వామ్యమే’ అంటూ ప్రధాని మోదీ బదులిచ్చారు. ఇంకేముంది మోదీ ‘టైమింగ్’ను మెచ్చుకుంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టేశారు. మొత్తానికి మోడీ కూడా తనకు మంచి టైమింగ్ ఉందని ప్రూవ్ చేశారు. కాగా ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ 300 స్థానాలకు పైగా గెలిచి విజయం సాధించింది.