ఆసీస్ 451 పరుగులకు ఆలౌట్‌..

 

రాంచీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 451 పరుగులకు ఆలౌట్‌ అయింది. నిన్న ప్రారంభమైన మ్యాచ్ లో బ్యాటింగ్ దిగిన ఆసీస్ 83 ఓవర్లు ముగిసే సరికి 272/4తో నిలిచింది. ఇక ఈరోజు 451 పరుగులకు ఆలౌట్‌ అయింది. 117 పరుగుల వ్యక్తిగత ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసేంత వరకు అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్‌ మాక్స్‌వెల్‌  టెస్ట్‌ కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 191 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. కాగా జ‌డేజా 5, ఉమేష్ 3, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu