విమానం కూలిపోయిన 54 ఏళ్ళ తరువాత...
posted on Feb 9, 2015 12:02AM

మొన్నీమధ్య మలేసియాకి చెందిన ఒక విమానం వందలాది మంది ప్రయాణికులతో మాయమైపోయి జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. అదే తరహాలో చిలీలో ఒక విమానం 54 ఏళ్ళ అదృశ్యమైపోయింది. 1961 ఏప్రిల్ 3వ తేదీన చిలీ దేశానికి చెందిన ఫుట్‌బాల్ జట్టు సభ్యులు నలుగురితోపాటు మొత్తం 24 మంది ప్రయాణికులున్న విమానం అదృశ్యమైపోయింది. ఆ విమానం కోసం ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విమానం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో విమానం ఎక్కడో కూలిపోయి వుంటుందని, ఆ విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయి వుంటారని నిర్ధారించుకుని సంతాపసభ కూడా ఏర్పాటు చేశారు. ఇన్నేళ్ళ తర్వాత ఆ విమానం శిథిలాలు శాండియాగోకి 360 కిలోమీటర్ల దూరంలో 3200 మీటర్ల ఎత్తులో శిథిలాలను కనుగొన్నట్లు పర్వతారోహకులు తెలిపారు.