ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన కేసీఆర్
posted on Feb 9, 2015 8:30PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కి తిరిగొచ్చారు. సోమవారం నాడు ఆయన కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ, వాటర్ గ్రిడ్ పథకాల అమలు తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా బీరేంద్రసింగ్ వాటర్ గ్రిడ్ పథకం చాలా పెద్ద పథకం అన్నట్టు తెలుస్తోంది. అనంతరం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర మంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చారు. ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చే ముందు కేసీఆర్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కూడా కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడికి తెలంగాణకు అవసరమైన నిధుల విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని వెంకయ్య ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.