పిఠాపురం ఈ సారి పవన్ కళ్యాణ్ దే... కొనసాగుతున్న సెంటిమెంట్

పిఠాపురం... 
40 ఏళ్ళ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి గెలిచాడు. మరి ఈ సారి వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఏ కోశానా లేదు.విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠగా మారింది. 
ఒకప్పుడు జమిందారులు  పిఠాపురం సంస్థానాన్ని  పాలించారు. సంగీతం, సాహిత్య, ఆధ్యాత్మికతను పెంచిపోషించి ప్రత్యేకతను చాటుకుంది ఈ సంస్థానం. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో పిఠాపురం పోరు ఉత్కంఠ రేపుతోంది.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానికన్నా పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ గెలుస్తాడా? లేదా? అనేదే  ఉత్కంఠ అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్కంఠ నెలకొందంటే ఫిఠాపురంలో  రాజకీయ వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పవన్ క‌ళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదనేది వైసీపీ సిద్దాంతం.  
ఆరు నూరైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని  జనసేనాని పట్టుబడుతున్నారు. అటు జ‌గ‌న్‌, ఇటు ప‌వ‌న్ ఇద్ద‌రూ  మాంచి క‌సి మీద ఉన్నారు. 
అస‌లు పిఠాపురం రాజ‌కీయం ఎలా వుంది అనేది  ఎపి ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. పేపర్లు తిరగేస్తున్నారు. టీవీలకు అతుక్కుపోతున్నారు.   మొత్తం రాష్ట్రం పిఠాపురం వైపే చూస్తోంది. ఎందుకంటే పవన్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ ను ఈ  ఎన్నిక‌లు నిర్దేశించ‌నున్నాయి.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ - వంగా గీత ఎవ‌రి బ‌లం ఏమిటో చూద్దాం.
ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి  పరిశీలిద్దాం. టీడీపీ నేత‌ వ‌ర్మ‌తో ఉన్న త‌ల‌నొప్పి సెట్ అయింది. ఎందుకంటే 
చంద్ర‌బాబునాయుడే వ‌ర్మ‌కు  హామీ ఇచ్చారు.  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  మొద‌టి విడ‌త‌లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాన‌ని హామీ దొర‌క‌డంతో వ‌ర్మ కూల్ అయ్యారు.
 దీంతో 91 వేల మంది కాపులు. వారి ఓట్ల‌న్నీ అనుకూలంగా మారుతాయి.
 కుప్పం, పులివెందుల త‌ర‌హాలో  పిఠాపురంను స్వంత‌ నియోజ‌క‌వ‌ర్గం చేసుకుని నియోజ‌క‌వ‌ర్గ రూపురేఖ‌ల్ని మార్చివేస్తానంటూ ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌చారానికి పిఠాపురం ఓట‌ర్లు ప‌డిపోయారు. 
 యూత్ ఓట‌ర్లు ప‌వ‌న్‌కు అనుకూలంగా వున్నారు. సినిమాల్లో పవన్ కు ఉన్న క్రేజు యూత్ ఓటర్లు ఆకట్టుకునేలా చేస్తోంది. 
గ‌తంలో ప్ర‌జారాజ్యంకు ప‌ట్టు వున్న నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టి  ప‌వ‌న్ కు ఈ ఓటు బ్యాంక్ క‌లిసివ‌స్తోంది. పిఠాపురం ప‌వ‌న్‌కు క్యాట్ వాక్ అని చెప్ప వ‌చ్చు. 
 అంతే కాదు ఇక్క‌డి ఓట‌ర్ల స్వ‌భావం  ఏమిటంటే  గ‌తంలో గెలిపించిన‌ పార్టీని మ‌ళ్ళీ గెలిపించ‌రు. కాబ‌ట్టి ఈ సారి జ‌న‌సేన‌కు అవ‌కాశం ఇస్తారు అని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 
1978 నుంచి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు.. 
1978లో కాంగ్రెస్‌ తరుపున కొప్పున మోహన్‌రావు గెలిస్తే.. 
1983లో తెలుగుదేశం వేవ్‌లోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు. 
1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు, 
1989లో కాంగ్రెస్‌ నుంచి కొప్పన మోహనరావు, 
1994లో టీడీపీ తరపున నాగేశ్వరరావు, 
1999లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు.. 
2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు, 
2009లో ప్రజారాజ్యం తరపున వంగా గీత, 
2014లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి వర్మ గెలుపొందారు.. 
2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు విజయం సాధించారు. 
అయితే, 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు.. 
ఈ సారి గెలుపు పవన్‌ కల్యాణ్‌దే అని జనసేన లెక్కలు వేస్తోంది. 
ప్రతీ ఎన్నికల్లో విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు.. 
2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది..

వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతకున్న బ‌లం ఏమిటో చూద్దాం
ఆమె కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలే. 
సుదీర్ఘ రాజకీయ ఆనుభ‌వం వుంది. ఆమె రాజ‌కీయ ప్రస్థానంలో  పలు పదువులు చేపట్టారు. 
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీలోకి వెళ్లారు. 
గత ఎన్నికల్లో వైసీపీ నుంచే కాకినాడ ఎంపీగానూ గెలిచారు. 
అంతకు ముందు టీడీపీ నుంచి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు. 
ఇలా అసెంబ్లీ, లోక్ సభ, రాజ్య సభ మూడు చట్ట సభలకూ ప్రాతినిధ్యం వహించిన ప్రత్యేకత ఆమె సొంతం.
 10 వేల రెడ్డి ఓట్లు వున్నాయి. అవి కూడా ఆమెకు ప‌డ‌వ‌చ్చు. లోకల్ ఫ్యాక్టర్ తీసుకువ‌చ్చి ప‌వ‌న్ నాన్ లోక‌ల్ అనే ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నం. ఆయన సెలిబ్రిటీ. ఒకసారి గెలిచిన తరువాత అందుబాటులో వుండ‌ర‌నే ప్ర‌చారం బలంగా ఉంది. 
పవన్ ఏ కుల ఓట్లపై ఎక్కువ ఆధారపడ్డారో అక్క‌డే జ‌గ‌న్ దెబ్బ కొట్టాల‌నుకుంటున్నారో,  అదే సామాజికవర్గానికి చెందిన కీలక నేత ముద్రగడ వైసీపీలో చేర్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వైసీపీకి కలసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. 
 దాంతో పాటు వంగా గీతకు కూడా అక్కడ సొంత ఇమేజ్ పలుకుబడి ఉన్నాయి.
 ఇక్క‌డున్న 3 మండలాలు. గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి.
పిఠాపురం, ద్వారంపుడి చంద్ర‌శేఖ‌ర్ 
యు.కొత్తపల్లి, దాడిశ‌ట్టి  రాజా
గొల్లప్రోలు  కుర‌సాల క‌న్న‌బాబు ల‌ను ఇంఛార్జ్‌లుగా పెట్టి ముద్రగడ పద్మనాభం కో ఆర్డినేష‌న్ చేసుకుంటూ
పవన్‌కల్యాణ్‌ను ఓడించేందుకు బాధ్య‌త‌ను అప్పజెప్పినట్లు సమాచారం.
వీరికి అనుబంధంగా ఐప్యాక్ టీం 
ప్ర‌భుత్వ సంక్షేమం పొందిన ల‌బ్దిదారుల ఓట్లు వైసీపీకి ప‌డేలా చేయ‌డంతో పాటు,
కాపు ఓట్ల చీల్చ‌డం వార్తలు వస్తున్నాయి. 
బీసీ, ఎస్సీ ఓట్లు క‌లుపుకునే వెళ్ళాలా వైసీపీ వ్యూహం వుంది.
గ్రామీణ ప్రాంత ఓట‌ర్లు వైసీపీకి అనుకూలంగా వుండ‌టం కూడా ఆమెకు క‌లిసి వ‌చ్చే అంశం.

ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్‌ కల్యాణ్ ప్లాన్‌ చేస్తున్నారు.. 
అయితే, పవన్‌ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది.. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu