గడప గడపకు తిరగబడుతున్న ప్రజ!
posted on Jun 17, 2022 11:09AM
పాలన అద్భుతంగా సాగుతుంటే ప్రజలు భుజానకెత్తుకుంటారు. కేవలం ప్రచార ఆర్భాటంతో నడుస్తుం టే నొసట విరుపులూ వుంటాయి. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు గనుక వారికి ఆగ్రహించే హక్కూ వుం టుంది. ప్రజాసంక్షేమ పథకాల ఫలాలు నిజంగానే ప్రజలకు అందాలి కేవలం పేరుకి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే ఎదరయ్యేవన్నీ అవమానాలే! ప్రజలు తిరగబడతారు, కాదు పొమ్మం టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలన పరిస్థితి ఇలానే వుంది.
వైసిపి గడప గడప కార్యక్రమం ఉదృతంగా చేపట్టదలిచారు. ప్రజల వద్దకు వెళ్లి తమ సంక్షేమ కార్యక్ర మాల గురించి వైసీపి ఎమ్మల్యేలు, మంత్రులు ఇంటింటికీ తెగ తిరుగుతున్నారు. తమది గొప్ప సంక్షేమ రాజ్యమని, పింఛన్లు పెద్ద మొత్తంలో అందస్తున్న ఘనత తమదేనని ప్రచారం చేస్తూ ప్రజలకు వారి సేవలు ఎంతగా నచ్చాయో తెలుసుకుందామని గడప గడపకూ తిరుగుతున్నారు. చిత్రమేమంటే పింఛ న్లు ఇప్పుడే కాదు చాలాకాలం నుంచి వస్తున్నాయి, గత ప్రభుత్వాలు ఇచ్చాయన్నది ప్రజలు తమ వద్దకు వచ్చిన వైసీపీ నేతలకు అర్ధమయ్యేలా చెబుతున్నారు. ప్రభుత్వం వూరికే ఏమీ ఇవ్వడంలేదు, పన్నులు, ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అలాంటపుడు ఏదో ధర్మ సేవ చేస్తున్నట్టుగా గమ్మం వద్దకు మరీ వచ్చి అడగడంలో అర్ధం లేదు. నిజానికి ప్రజలు ఈ మూడేళ్ల పాలనతో విసిగెత్తారు. ఏదో మహాద్భుతం చేస్తాడని గెలిపించినా నిష్ప్రయోజనమే అయిందని బాధపడుతున్నారు. అదే సంగతి తమ వద్దకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు కుండబద్దలుకొట్టినట్టు చెబుతున్నారు. వారిని నివారించి తమ ప్రభుత్వం, సీఎం తమ కోసమే పనిచేస్తోందని, ఇంతకంటే గొప్పగా సేవలు ఎవరూ అందించలేరన్న జగన్ సంకీర్తన చేస్తున్నవారిని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
పేదలకు ఇళ్ల నిర్మాణం, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు వంటివి చాలాకాలం నుంచే వున్నాయని, వాటిని తమరే ఆరంభించి ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకోవడంలో అర్ధంలేదని ప్రజలు గట్టిగానే తమ వద్దకు వచ్చినవారికి చెబుతున్నారు. ప్రజలు అమాయకులు కారు, ప్రచార ఆర్భాటం ఏది, వాస్తవంగా జరుగుతున్నదేమిటనేది వారికి ఎంతో బాగా తెలుసు. అసలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, ఫలితాలు అందాల్సిందే వారికి కనుక అవి ఎంతవరకూ సక్రమంగా జరగుతున్నదీ లేనిదీ వారికిగాక మరెవరికి తెలు స్తుంది? గడప గడపకీ వెళ్లి తెలుసుకునే నాయకులకు ప్రజలను తమ వేపు ఏ మేరకు ఇంకా వెన్ను దన్నుగా వున్నారన్నది తెలుసుకోవడమే ఈ కార్యక్రమం అసలు రహస్యంగా తెలియకపోలేదు. ప్రజలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని సమర్ధించాలన్నదానిలో వున్నంత స్పష్టతను తక్కువ అంచనా వేసి వైసీపీ నాయకులు ఈ మహాద్బుత కార్యక్రమాన్ని చేపట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గడప గడపకు కార్యక్రమంలో ఇళ్లచుట్టూ ప్రదక్షిణం చేస్తున్నవారందరికీ చేదు అనుభవాలే ఎదురవుతు న్నాయి. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నాయకులు నీళ్లు నములుతున్నారు. దీంతో అసలు మా వద్దకు ఎందుకు వచ్చినట్టు అని ఎదురుప్రశ్న వేయడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు సమాధానం చెప్పలేక భయపడిపోతున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం ఈ వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అలాగే స్థానిక వైసీపీ మహిళా నేతలు కూడా ప్రజల పక్షాన తమ నాయకులను నిలదీశారు. ఇటువంటి వ్యతిరేకతలు తలెత్తడం వెనుక టీడీపీ నేత జనార్ధన్ హస్తం వుందన్న అనుమానాలు బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలోనూ ఎమ్మెల్యే పి.ఉమాశంకర్ గణేష్ ను ప్రశ్నించడాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక అసహనం వ్యక్తంచేశారు. అటు అరకులో ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పై గిరిజన మహిళలు ఎదురుతిరగారు. తమ స్థలాన్ని కబ్జా చేశారం టూ నిలదీశారు. ఆయన వూహించని ఈ సంఘటనకు బెదిరిపోయి కార్యక్రమాన్ని వదిలి వెళిపోయారు. పోలవరం ఎమ్మెల్యే ఇళ్ల స్థలాలు, పింఛన్ల మాట ఎత్తగానే మహిళలు ఎదురుతిరిగారు.
గడప గడపకు కార్యక్రమం రాష్ట్రం అంతటా విఫలమయిందనాలి. కార్యక్రమంలో ప్రజలను మభ్యపెట్టా లని చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు వూహించని వ్యతిరేకతే ఎదురయింది. ఈ మొత్తం కార్యక్ర మాన్ని, వ్యతిరేకతను తరచి చూస్తే రాష్ట్రంలో వైసీపీకి నూకలుచెల్లినట్టే వుందని రాజకీయ విశ్లేష కులు భావిస్తున్నారు. తమ ప్రభుత్వ పాలన, పథకాల అమలు గురించి అడగడానికి పెట్టిన కార్యక్రమంలా కాకుండా ప్రజలు తమ ప్రభుత్వాన్ని అభిమానిస్తున్నారో తెలుసుకోవడానికి చేపట్టినట్టు వుందని అంటు న్నారు.