గుణపాఠమా.. తిరస్కారమా?

గత ఎన్నికలలో అంటే 2018 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించి,  ఆ తరువాత బీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలకు ఈ సారి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అలా పార్టీ మారి ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీలోకి దిగిన 12 మంది ఎమ్మెల్యేలలో తొమ్మది మందిని ప్రజలు తిరస్కిరించారు. వారిని ఓడించి గుణపాఠం చెప్పారు.  

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన హరిప్రియ నాయక్, రేగా కాంతరావు, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్రవెంకటరమణా రెడ్డి, ఆత్రం సక్కు, డి.సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ  మారిన వారిని ఈ సారి చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరింది. సరే ఈ సారి ఎన్నికలలో  ఎల్బీనగర్ నుంచి, సుదీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డిలు మాత్రమే గెలుపొందారు.

వీరిలో ఆత్కం సక్కుకు కేసీఆర్ టికెట్ నిరాకరించగా పోటీకి దూరంగా ఉన్నారు. మిగతా 9 మందీ టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర రావులు సైతం ఓటమి పాలయ్యారు. ఇక బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు స్థానాల్లోనూ కూడా వెనుకంజలో ఉన్నారు.