జెయింట్ కిల్లర్ యశస్వినీ రెడ్డి
posted on Dec 3, 2023 3:03PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. నిన్నటి వరకూ తిరుగులేని నేతలుగా చెలామణి అయిన వారు ఊహించని రీతిలో పారాజయం పాలైనారు ఉన్నారు.
వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఒకరు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకరరావుపై పాతికేళ్ల యువతి విజయం సాధించారు. ఎర్రబెల్లికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పాలకుర్తిలో పోటీ చేసిన యశస్వినీ రెడ్డి చేతిలో మంత్రి ఎర్రబెల్లి పరాజయం పాలయ్యారు.
తెలుగుదేశం టికెట్ పై విజయం సాధించి ఆ తరువాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ఎర్రబెల్లి కేసీఆర్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. జిల్లాలో అన్నీ తానై చక్రం తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నీ తన కనుసన్నలలోనే జరగాలనే విధంగా ఆయన వ్యవహరించారు.