చంద్రబాబు ప్రకటనపై పవన్ కళ్యాణ్...స్వాగతిస్తున్నాం...
posted on Jan 7, 2017 10:16AM

ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా నిలుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీల వ్యాధులతో బాధపడుతున్నవారిని పరామర్శించి.. వారి సమస్యలను తెలుసుకొని.. ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా పెట్టారు. దీనిపై స్పందించిన చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రకటనపై స్పందించిన పవన్ కళ్యాణ్... బాధితుల సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకున్నారని...ఉద్దానం బాధితుల సమస్యపై స్పందిస్తూ చంద్రబాబు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఉద్దానం బాధితుల సమస్యలను పరిష్కరించడానికి పడిన మొదటి అడుగుగా అభివర్ణించారు. ఇంకా ప్రభుత్వం ఒక్కటే కాదు.. వారికోసం అన్ని పార్టీలు స్పందించాలని... అది అన్ని పార్టీల బాధ్యత అని తెలిపారు.