పుతిన్ పై ఒబామా సంచలన వ్యాఖ్యలు...

 

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదని.... పుతిన్ చర్యలపై తమకు ఎప్పుడూ నమ్మకం లేదని.. కానీ కొంతమంది అమెరికన్లు ఆయనకు మద్ధతునివ్వడం ఆందోళనకరంగా ఉందని... ఆ కొంతమంది ఎవరో కాదు రిపబ్లికన్ పార్టీ నేతలు అని తెలిపారు. ఎన్నికల తర్వాత పరిస్థితిపై మాట్లాడుతూ.. అప్పుడు.. ఇప్పుడు మేం అదే విధంగా ఉన్నాం. మాలో ఏ మార్పులేదని అన్నారు. ఇతర దేశాల నేతలపై ఆధారపడటం అమెరికాకు మంచిది కాదని...డెమొక్రాటిక్ పార్టీ నేతల కంటే పుతిన్ నే ట్రంప్ ఎక్కువగా విశ్వసిస్తున్నారని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu