ఇపుడు వీస్తున్న గాలి.. దేశ‌భ‌క్తి !

అధికారం చేజిక్కించుకోవ‌డానికి పోటీ ప‌డే రాజ‌కీయ పార్టీలు హ‌ఠాత్తుగా దేశ భ‌క్తి లో ఎవ‌రు గొప్ప అనేది తేల్చుకోవ‌డంలో ప‌డ్డాయి. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం అనేక సందర్భాల్లో వారిదే అస‌లు సిస‌లు దేశ‌భ‌క్తి అంటూ ప్ర‌క‌టించ‌డం ప‌రిపాటిగా మారింది.  దేశభ‌క్తి దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఉంటుంద‌ని బీజేపీ వారు ఒక్క‌రే దేశ‌భ‌క్తులుగా భావించ‌డం, కాషాయంలో మునిగితేల‌డం, ప్ర‌జ‌లంద‌రినీ అదే రంగులో ప్ర‌యాణిం చేలా ఉత్తేజితుల‌ను చేయ‌డానికి క‌స‌ర‌త్తులు చేయ‌డం మాత్రం దేశ‌భ‌క్తి కాద‌న్న‌ది విప‌క్షాల మాట‌. 

కాలం మారినా, రాజ‌కీయాలు మారినా, సిద్ధాంతాల ప‌రంగా ఒక‌రికి  ఒక‌రు ప‌డ‌క‌పోయినా  దేశ‌మంత‌టా అంద‌రూ గౌర‌వించేది మ‌హాత్మాగాంధీనే. ఎందుకంటే ఆయ‌న మ‌హాత్ముడు గ‌నుక‌. కాంగ్రెస్ అంటే బొత్తిగా ప‌డ‌ని టీఆర్ ఎస్ కూడా ఇపుడు కాంగ్రెస్ మాయ‌లో ప‌డింద‌నే అనుమానాలూ వ‌స్తున్నాయి. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ  తెలంగాణా రాష్ట్ర‌మంత‌టా ఎంపిక చేసిన 522  సినిమా థియేట‌ర్ల‌లో  గాంధీ సినిమా ప్ర‌ద‌ర్శన‌కు టీ ఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ  సినిమా ఆగ‌ష్టు తొమ్మిది నుంచి 22వ తేదీ వ‌ర‌కూ ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తీరోజు ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి మ‌ధ్యాహ్నం 1.15 నిమిషాల వ‌ర‌కూ ప్ర‌ద‌ర్శిస్తారు. 

బెన్ కింగ్‌స్టే గాంధీగా న‌టించిన అట‌న్‌బొరో చిత్రం ఇది. దేశ‌మంత‌టా బ్ర‌హ్మాండంగా  కాబోయినా  చాలా మందిని ఆక‌ట్టుకుంది ఈ  చిత్రం. ముఖ్యంగా బెన్ కింగ్‌స్లే  గాంధీ పాత్ర‌లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశాడు. ఆయ‌న  కోస‌మే సినిమాకి జ‌నం వెళ్లారు.  అయితే ఈ చిత్రం బ్రిటీష‌ర్లు దేశానికి మ‌హామేలు చేశార‌న్న ప్ర‌స్థా వ‌న మ‌ళ్లీ తెలియ జేయ‌డమే ప్ర‌ధానంగా ఈ చిత్రం వ్య‌క్తం చేసింద‌నేది  చాలామంది విమ‌ర్శ‌కుల మాట‌. 

కేంద్రంలో స్వాతంత్య్ర‌దినోత్స‌వ వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హించే స‌మ‌యంలోనే ఇక్క‌డ తెలంగాణాలోనూ కేసీఆర్ అందుకు పోటీగా నిర్వ‌హించ‌డం త‌న దేశ‌భ‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌మే అయింది. బీజేపీ ప‌ట్ల త‌న విము ఖత‌ను మ‌రింత  స్ప‌ష్టం చేయ‌డానికే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తుగా మునుగోడు లో అభ్య‌ర్ధిని నిల‌బెట్ట‌డం లేదు.  రాష్ట్ర అవ‌స‌రాలాను, అభ్య‌ర్ధ‌న‌ల‌ను బొత్తిగా ప‌ట్టించుకోని కేంద్రం మాట విన‌క్క‌ర్లేద‌న్న ధోర‌ణినే టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వ్యక్తం చేస్తోంది. టీఆర్ ఎస్ నాయ‌కులు, మంత్రులు అవ‌కాశం దొరికిన వేదిక‌ల మీద మోదీ ప్ర‌భుత్వం మీద‌, బీజేపీ పార్టీ మీద విరుచుకుప‌డుతున్నారు. దేశ భక్తి అంటే కేవ‌లం బీజెపీ ఓవ‌రాక్ష‌న్‌తో వ్య‌వ‌హ‌రించ‌డ‌మేకాద‌ని దేశ‌భ‌క్తి త‌మ‌కూ ఉంద‌ని టీఆర్ ఎస్ ప్ర‌క‌టించ‌డానికే ఇపుడు రాష్ట్రంలో గాంధీ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు పూనుకుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu