హోదా బిల్లు చర్చ పై రచ్చ.. పలువురు ఇలా..
posted on Aug 5, 2016 4:20PM

రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ సందర్బంగా సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా బిల్లు కచ్చితంగా మనీ బిల్లేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. మనీ బిల్లులపై రాజ్యసభలో చర్చ చేపట్టవచ్చుగానీ, ఎలాంటి ఓటింగులకూ ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఒక బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అన్న విషయమై అనుమానాలు తలెత్తితే, లోక్ సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ (స్పీకర్) నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ద్రవ్య బిల్లులన్నీ తొలుత లోక్ సభలో మాత్రమే చర్చకు రావాలన్న రాజ్యాంగ నిబంధనలను జైట్లీ చదివి వినిపించారు.
దీనికి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించి.. హోదా ఇవ్వొద్దని 14 ఆర్ధిక సంఘం చెప్పలేదు.. ఈ విషయాన్ని నేను రుజువు చేస్తాను.. జైట్లీ కొన్ని అవాస్తవాలు చెప్పారు అని అన్నారు. దీనికి స్పీకర్ కురియన్ కల్పించుకొని అవాస్తవాలు చెబితే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వండి అని అన్నారు. ఇంకా కేవీపీ బిల్లుపై చర్చ ముగిసింది..ఓటింగ్ కు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి..కేవీపీ బిల్లు ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లుగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.. ఇది మనీ బిల్లాకాదా అని తేల్చేది లోక్ సభ.. లోక్ సభ స్పీకరే ఈ విషయాన్ని తేల్చాలి.. రాజ్యసభ ఛైర్మన్ కు అధికారం లేదు అని అన్నారు.
దీనికి కపిల్ సిబాల్ స్పందిస్తూ లోక్ సభలో ప్రవేశపెట్టే ప్రతి చట్టంవల్ల కేంద్ర నిధులపై ప్రభావం చూపుతుంది.. కేవీపీ ప్రైవేటు బిల్లులో ఆర్ధిక అంశాలు లేవు.. అరుణ్ జైట్లీ చెప్పేది వింటే ప్రతి బిల్లు మనీ బిల్లుగానే మారుతుంది.. బిల్లును లోక్ సభకు పంపించండి.. మనీ బిల్లా కాదా స్పీకర్ నిర్ణయిస్తారు అని అన్నారు.