బ్లాక్ మనీ టు రియల్ ఎస్టేట్

 

ఏ మార్గంలో డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యం కాదు.. ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. అలా తప్పుడు మార్గాలు ఎన్నుకునే చాలామంది చిక్కుల్లో పడుతున్నారు. మన ప్రభుత్వాలకి కట్టాల్సిన డబ్బులు ఎగ్గొట్టి... ఏవో తప్పుడు లెక్కలు చూపెడుతూ.. ఆ డబ్బును కాస్త విదేశాల్లో దాచిపెట్టి.. కోట్లకి కోట్లు రూపాయలు మూటగట్టుకుంటారు. కొన్ని లక్షల కోట్ల బ్లాక్ మనీ విదేశాల్లో మూలుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆ డబ్బును ఏం చేస్తారో వింటే కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. కొంతమంది బ్లాక్ మనీని  పొలిటికల్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటారు. మరి కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు.


అలాంటి మార్గాల్లోనిదే ఈ ఎంసెట్ స్కామ్. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్-2 లీకేజ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన ఈ స్కాం పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొన్ని కోట్ల రూపాయలతో చేసిన ఈ స్కాంలో ప్రధాన నిందితుడు అయిన రాజగోపాల్ రెడ్డిని అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఎంసెట్-2 లీకేడ్ స్కాంకు ఢిల్లీలోని ఇక్బాల్ అనే వ్యక్తి కీలకపాత్ర పోషించినట్టు సీఐడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి కలెక్ట్ చేసిన కోట్ల రూపాయలతో రాజగోపాల్ రెడ్డి అమరావతిలో ఫ్లాట్స్ కొన్నట్టు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల నుండి భారీ మొత్తంలో సొమ్ము జమ చేసిన గోపాల్ రెడ్డి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు తెలుపుతున్నారు. అమరావతిలోనే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా భూములు కొనడానికి ప్లాన్ చేశాడట. అయితే దీనికి రాష్ట్ర విభజన జరిగి అక్కడి భూములకు బాగా డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం కావచ్చు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత భూముల మండి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు కొని పెట్టుకుంటే భవిష్యత్తులో మంచి రేటుకు అమ్ముకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ముందు జాగ్రత్తగా అమరావతిలో ఫ్లాట్స్ కొనుక్కొని పెట్టుకున్నాడు.

 

మొత్తానికి అక్రమ మార్గంలో సంపాదించి కూడా ఎంచక్కా ఇంత దర్జాగా భూములు, ఫాట్స్ కొనుకుంటున్నారా. ఇంకా దౌర్భగ్యమైన పరిస్థితి ఏంటంటే..2007, 2013లోనూ క్వశ్చన్ పేపర్ లీకేజీ సూత్రధారుడు ఈయనే. 2014లో అవిభక్త ఏపీలో పీడీ మెడికల్ ఎంట్రెన్స్ లీకు చేసి భారీగా సొమ్ముచేసుకున్న ఘనుడు గోపాల్ రెడ్డి. ఇలాంటి నేర చరిత్ర ఉన్న రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్నది అందరి సందేహం. మరి ప్రభుత్వాలే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అక్రమంగా ఎందుకు డబ్బు సంపాదించరు..! నేరం ఎవరు చేసినా… కోట్లలో డబ్బులు మారినా… లోపమంతా ప్రభుత్వ యంత్రాంగంలోనే ఉందికదా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu