రాజ్‌ఘాట్‌లో రావి మొక్క

 

భారత పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గాంధీజీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి ప్రార్థించారు. సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి సమాధి మీద పూలు చల్లారు. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్‌కి వచ్చారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఒబామా బాపూజీకి నివాళులు అర్పించారు. ఒబామా వెంట ఇరుదేశాలకు చెందిన భద్రతా దళాల అధికారులతో పాటు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా ఒబామా వెంట ఉన్నారు. గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం ఒబామా రాజ్‌ఘాట్‌లో ఒక రావి మొక్కను నాటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu