ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా' ఫస్ట్ లుక్

టాలీవుడ్ 'బాద్ షా' యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. నందమూరి అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న హరీష్ శంకర్, ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా టైటిల్ ''రామయ్య వస్తావయ్యా''. పవర్ ఫుల్ స్టూడెంట్ క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

 

NTR film titled Ramayya Vastavayya, Ramayya Vastavayya first look,Ramayya Vastavayya NTR