ట్రంప్ పుండుపై కారం చల్లుతున్న కిమ్..

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఉత్తర కొరియా తీరుపై కారాలు, మిరియాలు నూరుతున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యాలు చెప్పింది కూడా వినకుండా ఉత్తరకొరియా తన పాటికి తాను క్షిపణులు ప్రయోగిస్తూ ఆగ్రహం తెప్పిస్తుంది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్..‘ఉ.కొరియా మరో క్షిపణిని ప్రయోగించింది. ఈ వ్యక్తి తన జీవితంలో ఏదైనా మంచిపని చేయలేడా?’ అని కిమ్‌నుద్దేశించి ట్వీట్‌ చేశారు. దీనికి చైనా దీటుగా బదులుచెప్పి ఉత్తరకొరియా చేసే చెత్తపనులను వెంటనే ఆపాలని ట్రంప్‌ కోరారు. ఇక దీనికి గాను  ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పుండుమీద కారం చల్లేరీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ బాలిస్టిక్‌ క్షిపణి విజయం.. అమెరికా బాస్టర్డ్స్‌కు వారి స్వాతంత్ర్య దినోత్సవ కానుక అని... 'జులై 4 వార్షికోత్సవం సందర్భంగా పంపిన ఈ కానుకను చూసి అమెరికా బాస్టర్డ్స్‌ అంతగా సంతోషించరు' అని కిమ్‌ అన్నట్టు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. 'వారి విసుగును దూరం చేసేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కానుకలను మనం పంపిస్తూ ఉండాలి' అని కిమ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు పేర్కొంది. కాగా ఉత్తర కొరియ ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అమెరికాతో పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న ఈ క్షిపణి ప్రయోగానికి  కిమ్‌ ఆదేశించారు. ఈ క్షిపణి 2,802 కి.మీ.ఎత్తుకు చేరుకుని 933 కి.మీ ప్రయాణించింది. 39 నిమిషాల పయనం తర్వాత జపాన్‌ సముద్రంలో పడిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu