నిత్యా శర్వాల టైటిల్ ఖరారు

 

నిత్యామీనన్, శర్వానంద్ జంటగా "ఏమిటో ఈమాయ" అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఈ చిత్రానికి "మళ్ళి మళ్ళి ఇది రానిరోజు" అనే టైటిల్ ను ఖరారు చేసారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే వీరిద్దరూ నటిస్తున్న "ఏమిటో ఈమాయ" కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu