పవన్ మీటింగ్ కు హాజరుకావద్దు: చిరు
posted on Mar 14, 2014 12:21PM
.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేందుకు సిద్దపడుతుండటంతో చిరంజీవి తన అభిమాన సంఘాల నేతలకు స్వయంగా ఫోన్లు చేసి తన సోదరుడి సభకు వెళ్ళవద్దని చెపుతున్నట్లు సమాచారం. పార్టీ స్థాపన గురించి అధికారికంగా పవన్ ప్రకటించనున్న తరుణంలో చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా గల తమ అభిమాన సంఘాల నాయకులతో ఢిల్లీనుంచి టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లుగా వినికిడి. రేపటి సమావేశాలకు వెళ్లరాదన్న ఆదేశాలను కొంతమంది చిరు అభిమానులు ధిక్కరిస్తూ మాట్లాడారట.
అదే నిజమయితే, పదవుల కోసం ఇప్పటికే తన పరువు పోగొట్టుకొన్న ఆయన ప్రజల దృష్టిలో ముఖ్యంగా అభిమానుల దృష్టిలో మరింత చులకనవడం తధ్యం. పవన్ కళ్యాణ్ అభిమానులలో చాలా మంది ఆయన సినిమాలను చూసి కాక ఆయనలో ఉన్న మానవతా దృక్పధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ నటించిన అనేక సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ ఆయనపై వారి అభిమానం చెక్కు చెదరలేదు.