స్పీడ్ న్యూస్ 1

1. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆమె భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ ఉదయం బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారికి పురందేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు. 

2.యూకే వెళ్లాలనుకునే వారికి ఇకపై అక్కడి వీసా ఖర్చులు పెరగనున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్వయంగా ప్రకటించారు. వైద్య ఖర్చుల కోసం వీసాదారులు చెల్లించే హెల్త్ సర్‌చార్జ్ ఇతర ఫీజులు పెరుగుతాయని ఆయన  స్పష్టం చేశారు.

3.ఏపీ సీఎం వైఎస్ జగన్ తనకు శత్రువు కాదని, అతనికి అంత సీన్ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. గురువారం తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో సమావేశమయ్యారు. 

4.ప్రాజెక్టుల విషయంలో కేంద్ర వైఖరిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి రెండో దశ పర్యావరణ అనుమతుల కోసం గురువారం కేంద్రానికి లేఖ రాశారు.

5.బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలు ఉన్నారని ఆ పార్టీ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు పదవిపై ఎలాంటి వ్యామోహం లేదన్నారు. 

6.ఉమ్మడి పౌర స్మృతికి  తాము వ్యతిరేకమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. అందరికీ ఒకే విధానమన్న విధానానికి తాము వ్యతిరేకమని తెలిపారు. యూసీసీని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ లా కమిషన్ కు లేఖ రాశారు.

7.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు, రేపు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.  
మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. 

8.. తగ్గినట్టే తగ్గి బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దమ్కీ ఇచ్చాయి.  బంగారం వచ్చేసి రూ.60 వేలకు చేరితే.. వెండి కిలోపై ఏకంగా రూ.2000 పెరిగింది. ఇంత భారీగా పెరగడం అనేది ఈ ఏడాదిలోనే జరగలేదని చెప్పాలి.

9.సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరదీసిందని టీడీపీ సీనియర్ నేత, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పేరిట రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చారని వెల్లడించారు. 

10.ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత పెదనాన్నను వాలంటీర్ ప్రవీణ్ దారుణంగా హత్య చేశాడు. పొలం తగాదా నేపథ్యంలో ఈ పెదనాన్నను హతమార్చాడు.

11.దుండిగల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే బి.ప్రభాకర్ రెడ్డి అనే ఎస్సై 35 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఆయనను జీనోమ్ వ్యాలీ పీఎస్ కు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

12.ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత విద్యార్థులకు ప్రాన్స్ శుభవార్త చెప్పింది. మాస్టర్స్ వంటి ఉన్నత చదువుల కోసం పారిస్ వచ్చే భారత విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక ఐదేళ్ల పాటు పనిచేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఐదేళ్ల వర్క్ వీసా ఇవ్వనున్నట్లు తెలిపింది. 

13.స్నేహితుడిపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం  యూపీలోని సోన్‌భద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో  జరిగిందీ ఘటన. బాధితుడు, నిందితుడు ఇద్దరూ మంచి స్నేహితులు. జవహర్ పటేల్ స్నేహితుడు గులాబ్ కోల్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత అతడిపై మూత్రవిసర్జన చేసినట్టు ఎస్పీ యస్వీర్ సింగ్ తెలిపారు.  

14. జనసేనాని కార్యక్రమాలకు ఇచ్చే ఎంట్రీ పాసులకు నకిలీలు సృష్టిస్తున్నారు. ఈ బెడద తప్పించేందుకు జనసేన పార్టీ వినూత్నంగా ఆలోచించింది. రూపాయి నోటును పోలిన పాసులను తయారు చేసింది. అచ్చంగా రూపాయి నోటులానే ఉండే ఈ పాస్ పై జనసేన స్టాంప్ ను ముద్రించి పంచుతోంది.

15.రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. యమునా నది వరదల నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితిపై ఆరా తీసినట్లు వెల్లడించింది. ఈమేరకు రాత్రి పీఎంవో ఓ ట్వీట్ చేసింది.

16.తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక కడతేర్చిందో భార్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఈ ఘటన వెలుగు చూసింది.  భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ ఇటీవల ఓ రోజు అతడి తలపై చెంబుతో బలంగా కొట్టి చంపేసింది. 

17.తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియలెస్టేట్ వ్యాపారి తిరుపతి రెడ్డి కిడ్నాప్ కు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆల్వాల్ లో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన భర్త కిడ్నాప్ కు గురయినట్టు ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

18.టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చెందిన యానిమేటెడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. 13 రోజుల్లోనే ఏకంగా 10 మిలియన్ వ్యూస్‌కు చేరువవుతోంది. టైటాన్ విషాదంలో పాకిస్థాన్ బిలియనీర్, ఆయన కుమారుడు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 

19.జాతుల మధ్య వివాదంలో క్రైస్తవ సమాజం పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్.వన్‌రామ్‌చువంగా రాజీనామా చేశారు. ఈ మేరకు మిజోరం బీజేపీ చీఫ్ వన్లాల్హ్ముకాకు లేఖ రాశారు. మణిపూర్‌లో క్రైస్తవ వ్యతిరేక కార్యకలాపాలపై తాను తీవ్రంగా కలత చెందినట్టు అందులో పేర్కొన్నారు. 

20. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 145 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు.