సామాన్యులకు ఖుషీ ఖుషీగా బడ్జెట్

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది బుధవారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన తొలిసారి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఎనిమిదో సారి యూపీఏ సర్కార్ రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. విజన్ 20-20గా ఈ బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లు దినేష్ త్రివేది తెలిపారు. తాను చిరునవ్వుతో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నానని  ఆయన అన్నారు. బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. రైల్వే ప్రగతి పైనే దేశాభివృద్ధి ఉందని ఆయన అన్నారు. రైల్వేను బంగారంగా తీర్చిదిద్దాలన్నదే తమ అభిమతమన్నారు. రైల్వే సాధించిన విజయాలను ఆయన కార్మికులకు అంకితం చేశారు.

గత కొన్నేళ్లుగా ఛార్జీలను పెంచని రైల్వే ఈసారి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి సుంకం పేరుతో కొత్తగా పన్నులు విధించే అవకాశం ఉంది. కాగా త్రివేది సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌తో పాటు గుజరాత్ వంటి రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపే అవకాశముంది. నూతన బడ్జెట్‌లో సాధారణ ప్రయాణీకులపై ఛార్జీల భారం ఉండకపోయినప్పటికీ ఉన్నత తరగతులపై ఛార్జీలు పెంచే అవకాశముంది. రైల్వే సర్వీసుల్లోనూ మార్పులు చేసే అవకాశముంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu