నేపాల్‌లో భారీ భూకంపం
posted on Apr 25, 2015 1:30PM
నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం నాడు సంభవించిన భూప్రకంపనలతో నేపాల్లో భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలాయి. నేపాల్ రాజధాని ఖట్మాండుతో సహా ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వుంది. నేపాల్ లాంజంగ్ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి. భూకంపం కారణంగా భవనాలు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు. ఖాట్మాండు మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది. నేపాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. అందుకే భూకంపం సంభవించిన చాలాసేపటికి గానీ ఆ వార్త బయటి ప్రపంచానికి తెలియలేదు. భూకంపం కారణంగా ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. నేపాల్‌లో ఏర్పడిన ఈ భూకంప ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఢిల్లీతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది.