నెహ్రూ పూలదండ.. కన్యగానే మిగిలిపోయిన బాలిక
posted on May 23, 2023 4:41PM
జార్ఖండ్ నదీ పరివాహక ప్రాంతంలోని
దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్‌లో పనిచేసిన బుద్నీ మెహజన్ సంతాలీ తెగకు చెందిన అమ్మాయి.వీళ్లది ప్రత్యేక కల్చర్. 1959 డిసెంబరులో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ బుధ్ని పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. నెహ్రూ బుద్నీకి పూలమాల వేసి స్వాగతం పలికారు. పూల మాలతో చేసే సన్మానం వివాహం క్రింద పరిగణిస్తారు సంతాలీలు. సంతాలీ సంప్రదాయాల ప్రకారం, ఆమెకు నెహ్రూ పూలమాల వేయగానే భార్యగా మారిపోయింది. ఇది బుద్నీకి శాపం లా పరిణమించింది. సంతాలి సంప్రదాయం ప్రకారం నెహ్రూ భార్యగా ప్రకటించబడింది, ఒక వ్యక్తి ఒక స్త్రీకి పూలమాల వేయగానే ఆమెతో అతని వివాహం అయినట్టేనని పరిగణించాల్సి వస్తుంది.. సాంప్రదాయాల ప్రకారం, సంతాలీ యేతర వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఆమెను సంఘం నుండి బహిష్కరించారు.
నేను ప్రధాని నెహ్రూకి పూలమాల వేయలేదని సంతాలి తెగవారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది. నేను కేవలం అతనికి కరచాలనం ఇచ్చాను. ఈ చిన్న పొరపాటు వల్ల నేను మా గ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని అప్పట్లో బుధ్ని స్టేట్ మెంట్ ఇచ్చింది. నేను నా సంఘం నుండి బహిష్కరించబడ్డాను. నేను డివిసి పవర్‌హౌస్‌లో వర్కర్‌ని. అయితే, 1962లో డివిసి నన్ను ఉద్యోగం నుండి తొలగించింది. ”
1985లో అప్పటి ప్రధాని, నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ బుధ్ని కోసం వెతికారట. ఆ తర్వాత భిలాయ్‌లో తనను కలవాల్సిందిగా రాజీవ్ ఆహ్వానించారని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన పత్రాలను పరిశోధిస్తున్నప్పుడు రాజీవ్ కు బుధ్ని గురించి తెలిసింది.