నమ్మకమే వ్యాధిని తరిమికొడుతోంది
posted on May 23, 2023 6:27PM
చేప మందులో శాస్ట్రీయత కంటే నమ్మకమే చేప ప్రసాద వితరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. దూద్ బౌలిలో చేప మందును తయారు చేసి వితరణ చేసే కార్యక్రమం చాలా సంవత్సరాలనుంచి కొనసాగుతుంది. కొందరు హేతువాదులు చేప మందు మీద నానా యాగి చేశారు చేప మందులో వాడే మందుకు శాస్త్రీయత లేదని, అందులో వాడే ముడి సరుకులో ఎటువంటి పస లేదని కొందరు గతంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో చేప మందు కాస్తా చేప ప్రసాదంగా మారిపోయింది. కరోనా కారణంగా గత మూడేళ్ల నుంచి ఈ చేప ప్రసాద వితరణ ఆగిపోయింది. చేప మందు ప్రసాద వితరణలో నమ్మకమే వైద్యంగా మారింది. అస్తమాను తగ్గించే ఉత్ప్రేరకాలు ఇందులో లేవని హేతువాదులు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ప్రజల నమ్మకమే పరమావధి అని బిఆర్ఎస్ సర్కారు భావించింది. మంత్రి తలసాని ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. జూన్ 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదాన్ని వితరణ చేస్తామన్నారు. ఒకప్పుడు రైల్వేశాఖ అస్సాం నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు నడిపింది అంటే చేప ప్రసాదానికి ప్రాశస్త్యం అలాంటిది.
చేప ప్రసాదంలో బతకున్న కొర్ర మీను చేపపిల్ల నోట్లో చేప ప్రసాదాన్ని పెట్టి ఆ చేపను మన గొంతులో వేస్తారు. ఒకే వ్యక్తి వందలాది మందికి చేపపిల్లలను నోట్లో వేయడాన్ని పలువురు వ్యతిరేకించారు. నాన్ వెజ్ వాళ్లకు కూడా చేప ప్రసాదాన్ని ఈ యేడు కూడా ఇస్తున్నారు.