నేడు దేశ వ్యాప్త రవాణా బంద్
posted on Sep 2, 2015 12:09PM
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రహదారి రవాణా భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని నేడు దేశ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెలో పలు కార్మిక సంఘాలు టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఈయూలు పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు, లారీలు నిలిచిపోయాయి. ఈ దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో రవాణ బంద్ సాగుతుంది.
ఆటో డ్రైవర్ల ర్యాలీ
మరోవైపు ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొనాలని యూనియన్ నాయకులు వెంకటేష్, నరేందర్, ఎ. సత్తిరెడ్డి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఆటో డ్రైవర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బంద్‌లో పాల్గొనాలని అన్ని ఆటో సంఘాల మద్దతు కూడగట్టామని వారు తెలిపారు.