పవన్ కళ్యాణ్ బర్త్ డే యాడ్.. అందరిలో ఆసక్తి

 

ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఎంతోమంది మంది అభిమానులు.. టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనులు తెలిపారు. అయితే అన్ని బానే ఉన్న ఇప్పుడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తీసిన యాడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణాజిల్లా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీవీ న్యూస్ ఛానల్ లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సంబంధాలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాలని ఆ యాడ్‌ ద్వారా కోరారు. దీంతో ఈ యాడ్ ఇప్పుడు చర్చాంశనీయమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu