జగన్నాటకం:ఏ1 ముద్దాయి ‘జగన్ మోదీ రెడ్డి’

 

విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.విశాఖలో ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లారు.అక్కడ సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందారు.ఏపీ సిట్ బృందం దాడిపై వాగ్మూలం తీసుకునేందుకు జగన్ ను హాస్పిటల్ లో కలిసింది.ఈ సందర్బంగా జగన్ ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, వాంగ్మూలం ఇవ్వటానికి నిరాకరించిన సంగతి విదితమే.దీనిపై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఏ1 ముద్దాయి ‘జగన్ మోదీ రెడ్డి’.. దొంగ, దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్‌లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు. కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తా అని పోలీసులకు బెదిరింపులు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదు అంటూ ప్రజలను కించపరిచే విధంగా ‘జగన్ మోదీ రెడ్డి’ మాట్లాడటం దారుణం’ అంటూ #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ జత చేశారు.