ఉరకలు వేస్తున్న టీడీపీ..భారీ వలసలు...
posted on Jul 5, 2017 3:33PM
.jpg)
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో టీడీపీ ఫుల్ ఫామ్ లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అవ్వగా ఇప్పడు నంద్యాల నుండి కూడా పలువురు వైసీపీ నేతలు పార్టీ ఫిరాయించనున్న్టట్టు సమాచారం. నంద్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ నౌమన్ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక రెండు రోజుల క్రితం టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సమక్షంలో 50 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఇప్పుడు నియోజకవర్గంలోని ఐదుగురు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీరే కాదు నంద్యాల మునిసిపాలిటీలో కూడా చాలా మంది కౌన్సెలర్లు సైతం టీడీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో నంద్యాల ఉపఎన్నికలో వైసీపీకి పరాజయం తప్పదని అంటున్నారు.