పవన్ సర్వే... చంద్రబాబే సీఎం..!


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడానికి ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీ, వైసీపీ పార్టీలు ఇప్పటినుండే వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. టీడీపీ, వైసీపీతో పాటు కొత్తగా వచ్చిన జనసేన పార్టీ కూడా పోటీకి దిగనుంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని పార్టీలన్నీ ఇప్పటినుండే చెప్పుకుంటున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తరువాత సీఎం తానే అని ఎప్పటినుండో చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు ఓ ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. అదేంటంటే ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఈసారి చంద్రబాబే సీఎం అవుతారట. టీడీపీనే ఎన్నికల్లో గెలుస్తుందట. ఇదేదో టీడీపీ చేసిన సర్వే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ సర్వే చేసింది జనసేన పార్టీ. జనసేన పార్టీ చేయించిన సర్వేలో టీడీపీకి 45 శాతం ఓట్లు..వైసీపీకి 31 శాతం ఓట్లు జనసేన పార్టీకి 18 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని తేలింది. అంతకుముందు ఢిల్లీకి చెందిన వీడీపీ స‌ర్వే సంస్థ చేయించిన సర్వేలో కూడా....టీడీపీకి 47 శాతం ఓట్లు, ప్రతిపక్ష వైసీపీకి 40 శాతం ఓట్లు రాగా, జనసేనకు కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేలింది. వీటితో పాటు  వైసీపీ ఇంట‌ర్న‌ల్‌గా చేయించుకున్న ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలో కూడా టీడీపీయే అధికారం చేపట్టనున్నట్టు తేలినట్టు సమాచారం. మొత్తానికి అన్ని సర్వేల్లోనూ టీడీపీయే గెలుస్తుందని రావడంతో టీడీపీ మాత్రం ఫుల్ జోష్ లో ఉంది కానీ జనసేన నేతలు మాత్రం కాస్త నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ సర్వేలు ఎంత వరకూ నిజం.. సర్వేలు చెప్పినట్టు టీడీపీయే అధికారంలోకి వస్తుందా..? తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu