ఎయిర్‌టెల్ మటాష్
posted on Jan 24, 2015 11:03AM

తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్‌టెల్ సేవలు నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచి ఎయిర్‌టెల్ ఫోన్లుగానీ, ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ గానీ పని చేయడం లేదు. ఫోన్లు వెళ్ళడం లేదు, ఫోన్లు రావడం లేదు. హైదరాబాద్‌తో సహా మొత్తం తెలంగాణలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ మటాషైపోయింది. దాంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు లబోదిబో అంటున్నారు. ఫోన్ నిత్యజీవితంలో చాలా అవసరమైన వస్తువు అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్లు అసలు పనిచేయకపోవడం పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తమకు అర్థం కావడం లేదని అంటున్నారు. ఎయిర్‌టెల్ సిగ్నల్ రెండు రోజుల నుంచి వీక్‌గా వున్నాయని, ఇప్పుడు మొత్తం ఆగిపోయాయని, సమస్యను గుర్తించకుండా ఎయిర్‌టెల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సమస్య వచ్చిందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.