బాబోయ్.. మెగా హీరోయిన్ కు అప్పుడే రెండో సినిమానా?
posted on Sep 28, 2015 6:35PM
ఈటీవీ ఢీ జూనియర్స్ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా నాగబాబు కుమార్తె నిహారిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తూ అందరినీ బాగానే ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు నిహారిక సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.. దీనిపై ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. మెగ ఫ్యామిలీ నుండి ఇప్పటివరకూ హీరోలు మాత్రమే ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మెగా హిరోయిన్ గా నిహారికా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే నిహారిక లవర్ బాయ్ నాగశౌర్యకు జోడిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లనేలేదు అప్పుడే నిహారిక ఖాతాలోకి మరో సినిమా చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మిణుగురులు సినిమా ద్వారా అవార్డ్ పొందిన అయోధ్య కుమార్ తాను తీయబోయే సినిమాలో నిహారిక ఎంపికైనట్టు తెలుస్తోంది. మొత్తానికి నిహారిక వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. మరి మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న పాప ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.