ఐదో రోజుకి ముద్రగడ దీక్ష.. క్షీణిస్తున్న ఆరోగ్యం..
posted on Jun 13, 2016 3:25PM
.jpg)
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన నిందితులను విడుదల చేయాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ముద్రగడ మాత్రం వైద్య పరీక్షలకు నిరాకరిస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు ముద్రగడ దీక్ష చేపట్టి ఈరోజుతో ఐదో రోజుకి చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. వైద్య బృందాలు ఎంత ప్రయత్నించి నప్పటికీ ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారని.. రాజమండ్రి సూపరింటెండెంట్ డా.రమేష్ కిషోర్ మీడియాకు తెలిపారు. ఆయన భార్య పద్మావతి, కోడలు సిరి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వారికి వైద్యసేవలందించేందుకు ముద్రగడ అనుమతించారు. దీంతో వారికి సెలైన్లు ఎక్కించామని కిషోర్ చెప్పారు. ముద్రగడ కుమారుడు గిరి మంచినీరు మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు.