"హే డొనాల్డ్ ట్రంప్.. ఐ లవ్ యూ".. వర్మ ట్వీట్
posted on Jun 13, 2016 3:48PM
.jpg)
కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్ ద్వారా ట్రంప్ పై ప్రశంసలు కురిపించాడు. అమెరికాలోని ఓర్లాండో గే నైట్ క్లబ్ పై దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్.. "మంచి వారికి చెడు జరిగితే, చెడ్డ వారిపై మరింత ఉక్కుపాదం మోపాలి" అని వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రామ్ గాపాల్ వర్మ గుర్తు చేస్తూ.. "హే డొనాల్డ్ ట్రంప్, ఇలా చెప్పినందుకు ఐ లవ్ యూ" అని ట్వీట్ చేశాడు. అంతేకాదు.. "అమెరికన్లకు ఇప్పుడు రెండే చాయిస్ లున్నాయి. వారిని ట్రంప్ ఆశీర్వదించాలి, లేదంటే అల్లా ఆశీర్వదించాలి" అని కూడా అన్నాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ట్రంప్ బెటర్ ఆప్షన్ అన్నాడు