డిసెంబర్ 6 డెడ్‌లైన్.. లేదంటే
posted on Oct 15, 2017 4:32PM
.jpg)
కాపు రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వానికి డిసెంబర్ 6 డెడ్‌లైన్‌గా విధిస్తున్నట్లు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఇతర కులాలు అనుభవిస్తున్న 49శాతంలో తమకు వాటా వద్దని, 51 శాతంలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని చెప్పారు. కాపు జాతి రోడ్డెక్కే పరిస్థితి తెచ్చింది చంద్రబాబేనని, రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలిపే అన్ని కులాలను కలుపుకునిపోతామని.. అందులో భాగంగానే సామాజిక పరివర్తన సమావేశాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజులోనే నిర్వహించారని, ఆ రిపోర్టును సీఎం కేసీఆర్ పరిశీలించి 9వ షెడ్యూల్‌లో చేర్చారని, మరి ఏపీలో సీఎం చంద్రబాబు ఏ నివేదికను తెప్పించుకోలేరా..? అని ప్రశ్నించారు.