పిల్లలకు ఆస్తులు కాదు.. సంస్కారాన్ని పంచండి
posted on Oct 15, 2017 3:55PM
.jpg)
పిల్లలకు ఎన్ని ఆస్తులు, ఎంత భూమి ఇచ్చామనేది కాదని.. ఎంత సంస్కారాన్ని నేర్పించామనేది ముఖ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. అబ్దుల్ కలాం పుట్టినరోజున ప్రతిభా అవార్డు పురస్కారాలు ఇవ్వడం సబబుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పారు. చదువు.. తెలివినిస్తుంది.. ఏదైనాసరే, సాధించే శక్తినిస్తుంది. అదే సమయంలో, సంస్కారం భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలి.. పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.