సామాన్యుడి కారు దొరికింది

అపహరణకు గురైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు దొరికింది. ఢిల్లీ సెక్రటేరియట్ పార్కింగ్ ప్రదేశానికి రెండొందల మీటర్ల దూరంలో కారు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కారును దొంగిలించడానికి వీల్లేకుండా ఉండే స్టీరింగ్ లాక్, గేర్ లాక్ వ్యవస్థలు లేకపోవడం వల్లే దుండగులు దీనిని అపహరించగలిగారని వారు చెప్పారు. మరోవైపు చోరికి గురైన నీలిరంగు వేగనార్ కారు కేజ్రీవాల్ సొంతది కాదని.. దీనిని ఆయన ఉపయోగించడం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మీద ఆ కారు రిజిస్టరైందని.. దాన్ని ఆ పార్టీ నేత వందన సింగ్ ఉపయోగిస్తున్నట్లు వారు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu