ధోనికి తప్పిన ప్రమాదం.. కాలిపోయిన క్రికెట్ కిట్..

 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనికి తృటిలో ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌ జట్టు కెప్టెన్‌గా విజయ్‌ హజారే ట్రోఫిలో పాల్గొంటున్న ధోని సెమీఫైనల్‌ మ్యాచ్‌ను ఆడేందుకు జట్టుతో కలిసి ఢిల్లీ వెళ్లిన వారు అక్కడ ద్వారకలోని వెల్‌కం హోటల్‌లో బసకు దిగారు. అయితే ఈ హోటల్ లో ఈరోజు ఉదయం మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని 30 ఫైరింజన్లతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో ధోనితో పాటు మిగిలిన క్రికెటర్లు కూడా హోటల్ లోనే ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే ట్రోఫీలో సెమీస్‌ మ్యాచ్‌ ఆడటానికి ఢిల్లీ వచ్చిన జార్ఖండ్‌ జట్టు కిట్‌ మొత్తం మంటల్లో బుడిదైంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu