ఫుల్ టైం కెప్టెన్‌గా కోహ్లీ..యూవీకి మళ్లీ ఛాన్స్..!

టీ20, వన్డే కెప్టెన్సీకి ధోనీ రాజీనామా చేయడంతో విరాట్ కోహ్లీ‌ని అధికారికంగా టీమిండియా ఫుల్ టైం కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. ఈ నెల 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ ఆడనున్న జట్టును ఎంపిక చేసేందుకు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలక్షన్ కమిటీ భేటీ అయ్యింది. అనంతరం సమావేశ వివరాలను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు వివరించారు. టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశామని చెప్పారు..అలాగే ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం జట్టును కూడా ప్రకటించారు.

జట్టు వివరాలు:

* విరాట్ కోహ్లీ (కెప్టెన్)
* మహేంద్ర సింగ్ ధోనీ
* రాహుల్
* శిఖర్ ధావన్
* యువరాజ్ సింగ్
* మనీష్ పాండే
* కేదార్ జాదవ్
* అజింక్యా రహనే
* హార్దిక్ పాండ్యా
* రవిచంద్రన్ అశ్విన్
* రవీంద్ర జడేజా
* అమిత్ మిశ్రా
* జస్ ప్రీత్ బుమ్రా
* భువనేశ్వర్ కుమార్
* ఉమేశ్ యాదవ్

Online Jyotish
Tone Academy
KidsOne Telugu