మిస్టర్ కూల్ గుడ్ బై....
posted on Jan 5, 2017 9:22AM

గత మూడేళ్ల క్రితం టెస్ట్ కెప్సెన్సీ కి గుడ్ బై చెప్పిన టీమిండియా కూల్ కెప్టెన్ ధోని.. ఇప్పుడు వన్డే కప్టెన్సీకి నుండి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. భారత్- ఇంగ్లండ్ కు పదిరోజుల్లో వన్డే సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ధోని తను కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్టు బీసీసీఐకు తెలియజేశాడు. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్‌గా జట్టుతో కలిసి కొనసాగుతానని మహీ పేర్కొన్నాడు. దీంతో వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా కోహ్లీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ధోనీ కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటబ్బా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ ఆంతర్యం ఏంటో ధోనికే తెలియాలి.
కాగా టీమ్‌ఇండియా ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.