ఎంసెట్ స్కాం కీలక నిందితుడు మృతి... పలు అనుమానాలు..
posted on Jan 5, 2017 9:49AM

ఎంసెట్ స్కాం కీలక నిందితుడు కమిలేశ్వర్ మృతి చెందాడు. గుండెపోటు కారణంగా రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన ఆస్పత్రిలో చేరిన కమిలేశ్వర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే కమిలేశ్వర్ మృతదేహానికి గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాగా ఎంసెట్ స్కాంలో ఇద్దరు ప్రధాన నిందితుల్లో కమిలేశ్వర్ ఒకడు. ఇతన్ని సీఐడీ నాలుగు రోజుల క్రితమే పట్నాలో అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడి సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో నిందితుడు కమిలేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చామని అధికారులు తెలిపారు.