మోదుగులకి కీలక పదవి !
posted on Jul 5, 2019 2:26PM

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న విజయసాయిరెడ్డి నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సాంకేతికంగా ఆయన ఎన్మ్పిక చెల్లదని తేలడంతో ముందు జాగ్రత్తతో వ్యవహరించి ఆయన ఎన్నిక క్యాన్సిల్ చేసింది. అయితే ఇప్పుడు ఆ పదవి ఎవరికీ దక్కనుంది ? అనేది కీలకంగా మారింది. ఈ క్రమంలో ఆ పదవికి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నియమిస్తున్నట్టు ప్రచారం మొదలయింది. మోదుగుల వేణుగోపాలరెడ్డి గతంలో నరసరావుపేట ఎంపీగా వ్యవహరించారు.
ఈ నేపధ్యంలో డిల్లీ రాష్ట్ర సమన్వయం మీద ఆయనకు అవగాహన ఉంది. గత టర్మ్ లో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తాజా ఎన్నికల్లో పార్టీ మారి గుంటూరు నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ది గల్లా జయదేవ్ మీద 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణతోనే ఆయన గెలిచారంటూ కోర్టులో వేసిన కేసు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మోదుగుల వేణుగోపాల రెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.