తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి!!

 

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవడం, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బలపడే దిశగా అడుగులు వేస్తుండడంతో కాంగ్రెస్ కూడా అలెర్ట్ అయింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ముందుగా టీపీసీసీ చీఫ్‌ను మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తికి పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంతియా కూడా సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను ధాటిగా ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి అని, ఆయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరి అదే జరిగితే టీఆర్ఎస్, బీజేపీల దూకుడుకి రేవంత్ రెడ్డి ఏ మేరకు బ్రేకులు వేస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu