హైదరాబాద్ లో మోడీ రోజు కో చోట బస ఎందుకంటే?

బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రెండు రోజులు బస చేయనున్న సంగతి తెలసిందే. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మోడీ రెండు రోజులూ  నోవాటెల్ లోనే బస చేయాల్సి ఉంది.  అయితే ఇప్పుడు అది మారింది.

జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి రోజు ఆయన నోవాటెల్ లో బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జూన్ 3న ఆయన బస రాజ్ భవన్ కు మారనుంది. మూడో తేదీన సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు మోడీ రాజ్ భవన్ నుంచే నేరుగా చేరుకుంటారు. సభ తరువాత ఆయన తిరిగి రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు అంటే జూలై 4న ఏపీ బయలు దేరి వెళతారు.  భద్రతకు సంబంధించి ఇబ్బందుల కారణంగానే ముందుగా నిర్ణయించిన విధంగా కాకుండా మోడీ బసను 3వ తేదీన రాజ్ భవన్ కు మార్చినట్లు చెబుతున్నారు.  

తొలి రోజు అంటే జూలై 2న నోవాటెల్ లోనే కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటం వల్ల మోడీ ఆ రోజు అక్కడే బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జూలై3 పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. నోవాటెల్ నుంచి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన బసను రాజ్ బవన్ కు మార్చారు. రాజ్ భవన్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు దూరం తక్కువ కావడంతో పెద్ద గా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.  అదీ టీఆర్ఎస్ బీజేపీ ఫ్లెక్సీ వార్, టీఆర్ఎస్, బీజేపీ నేతల  పరస్పర విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది.

ఈ నేపథ్యంలో రోడ్డు మార్గంలో మోడీ ఎక్కువ దూరం లేదా ఎక్కువ సేపు ప్రయాణించాల్సిన పరిస్థితి లేకుండా ఉంటే మంచిదని భద్రతాధికారులు సూచించడంతో ఆయన బసను రాజ్ భవన్ కు మార్చినట్లు చెబుతున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రోడ్ రోకో వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్న సమాచారం కూడా మోడీ బసను నోవాటెల్ నుంచి రాజ్ భవన్ కు మార్చడానికి కారణమని చెబుతున్నారు. మోడీ మినహా మిగిలిన బీజేపీ అగ్రనేతలంతా రెండు రోజులూ నోవాటెల్ లోనే బస చేస్తారు. 3వ తేదీ సాయంత్రం బహిరంగ సభ అనంతరం మోడీ రాజ్ భవన్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయమే ఆయన అక్కడ నుంచి నేరుగా ఏపీ పర్యటనకు వెళతారు