భారత - అమెరికా స్నేహం వర్ధిల్లాలి.. మోడీ...
posted on Jan 25, 2015 6:48PM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చలు జరిగిన అనంతరం ఒబామా, మోడీ సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ, ‘‘భారతదేశ ఆహ్వానాన్ని మన్నించి భారతదేశ గణతంత్ర వేడుకలలో పాల్గొనడానికి వచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ధన్యవాదాలు. అమెరికా - భారత దేశాల మధ్య స్నేహం వర్దిల్లాలి. ఇరు దేశాలు అన్ని రంగాలలో పరస్పరం సహకరించుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢం కావాలి. భారత - అమెరికాల మధ్య నవశకం ప్రారంభమైంది. రక్షణ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా వున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం వుంది. ప్రతి దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపాలి. పరిశుభ్రమైన ఇంధన వనరుల కోసం అమెరికా కృషి చేయాలి’’ అన్నారు.