లిక్కర్ స్కాంలో బుచ్చిబాబు అరెస్టు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చిక్కులు తప్పవా?

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది.  ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ తాజాగా . తాజాగా  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది.

మంగళవారం ఢిల్లీలో గోరంట్ల బుచ్చిబాబును విచారించిన సీబీఐ బుధవారం ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో సీఏ గోరంట్ల పాత్ర ఉందని సీబీఐ భావిస్తోంది.  ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జిషీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించటం తెలిసిందే. ఈ సౌత్ గ్రూప్ విజయ్ నాయర్ కల్వకుంట్ల కవిత మాగుంట శ్రీనివాసరెడ్డి శరత్ చంద్రలు భాగమని చెప్పటం తెలిసిందే. ఈ కేసు విచారణ ఈ మధ్యన కాస్తంత మందగించినట్లుగా అనిపించినా..  తాజా పరిణామాలు బట్టి చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఖాయమని చెప్పవచ్చు.  దేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా అటు దేశ రాజధని ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లలో రాజకీయ  ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం  ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది.  తాజా అరెస్టుతో ఎమ్మెల్సీ కవితకు ముందు ముందు మరిన్ని చిక్కులు తప్పవని పరిశీలకులు అంటున్నారు.

తొలుత దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేర్లను చేర్చిన ఈడీ.. ఇటీవల సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేర్లను చేర్చింది. ఇక ఇప్పుడు కవిత మాజీ సీఎ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు అరెస్టు చేసింది.