జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదాం!

జూబ్లీహిల్స్ నియోజక వర్గం రహమత్ నగర్ డివిజన్ లో కరోన వ్యాధి వ్యాప్తి కట్టడికి ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ పర్యటించి అవగాహన కల్పించారు. కరోన వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి అంటే స్వీయనియంత్రణ పాటించాలి, ప్రభుత్వం సూచిస్తున్న సూచనలు సలహాలు పాటించాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరు స్వీయనియంత్రణ పాటించి షాప్ ల వద్దకు గంపులు,గుంపులు గా కాకుండా సోషల్ డిస్టన్స్ పాటించి సరుకులు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 

రోజు వారీ కూలీలకు అన్నపూర్ణ పథకం ద్వారా ఉచిత ఆహారం 200 మందికి అందించారు. ప్రతిఒక్కరికి అండగా ప్రభుత్వం ఉంది. ఎవరు ఇబ్బందులకు గురికావద్దు మీకు అండగా మేము ఉన్నామ‌ని భ‌రోసా ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu