తెలుగు అందానికి.. అందాల కిరీటం
posted on Feb 11, 2021 5:03PM
తెలంగాణ అమ్మాయికి అందాల కిరీటం. హైదరాబాద్ కు చెందిన మానస వారణాసికి మిస్ ఇండియా 2020 టైటిల్. ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలో తన అందం, ప్రతిభతో మానస అందరికంటే ముందు నిలిచారు. హర్యానాకు చెందిన మణికా షియోకాండ్ మిస్ గ్రాండ్ ఇండియా 2020 కాగా, యూపీకి చెందిన మన్యసింగ్ మిస్ ఇండియా 2020 రన్నరప్‌లుగా నిలిచారు. 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పోటీ పడతారు.
మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్‌లో సినీ నటులు నేహా ధూపియా, చిత్రంగడ సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రఖ్యాత డిజైనర్ ఫాల్గుని, షేన్ పీకాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు.
హైదరాబాద్‌కు చెందిన మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో చదివారు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. మానస చిన్నతనంలనో భరతనాట్యం నేర్చుకున్నారు. కాలేజ్ డేస్ లో స్టూడెంట్ గా బ్యూటీ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి పలుమార్లు విజేతగా నిలిచారు. అప్పటి నుంచే ఆమెను అందాల పోటీల మీద, ఫ్యాషన్ రంగంపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత మోడలింగ్ పై ఫోకస్ పెట్టారు. పట్టుదలతో ప్రయత్నించి.. ఇప్పుడు ఏకంగా మిస్ ఇండియాగా నిలిచారు మానస. మానసకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. హెల్త్, ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ట్రెస్ గా ఫీలైతే మ్యూజిక్ వింటారు.