పులివెందుల పులి కోడి కత్తికే మంచమెక్కారు

 

పులివెందుల పులి, సింహం అని చెప్పుకొనే జగన్ కోడి కత్తికే మంచమెక్కారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవాచేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై దాడి ఘటనకు సంబంధంచి ఆయన సొంత పత్రికలో వచ్చిన తప్పుడు రాతలను ప్రజలు నమ్మరని  అన్నారు. జగన్‌ నాటకం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు. ‘అతడు’ సినిమాలో సీన్‌‌ను జగన్ ఫాలో అయ్యారని...సానుభూతి కోసం ప్రయత్నించారని విమర్శించారు. స్కెచ్‌లో భాగంగానే దాడి చేయించుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.ఏపీలోని ఏ వ్యవస్థ మీదా నమ్మకం లేని వైకాపా అధినేత జగన్‌.. హోదా ఇవ్వని మోదీపైనా, తెలంగాణ పోలీసుల పైనా నమ్మకం పెట్టుకున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.రాష్ట్రంలోని వ్యవస్థలపై నమ్మకం లేని జగన్ రాష్ట్రానికి సీఎం కావాలా? అంటూ ప్రశ్నించారు.పులివెందులలో నేర చరిత్ర జగన్‌కు ఉందని.. కానీ నారావారి పల్లెలో చంద్రబాబుకు లేదన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్‌కు చీమ కుట్టకుండా చూసుకున్నామని తెలిపారు.

 వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకెళ్తే ఉలుకు పలుకు లేని గవర్నర్ వద్దకెళ్లి విచారణ చేయమంటారా? అని నిలదీశారు.గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని,ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండగా జగన్‌పై దాడి ఘటన గురించి డీజీపీని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కేంద్రం కుట్రలో గవర్నర్‌ కూడా భాగస్వామే అని ఆరోపించారు.కేంద్రంతో విచారణ అని వైకాపా అంటోందని, రాష్ట్రపతి పాలన అని భాజపా అంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.తమిళనాడు, కర్ణాటక తరహాలోనే ఇక్కడా వైకాపాని అడ్డుపెట్టుకుని భాజపా కుట్ర పన్నుతోందని మంత్రి దుయ్యబట్టారు.జగన్ మీద కేసులేస్తే సీబీఐని దొంగ అన్నారు, ఇప్పుడదే సీబీఐతో విచారణ చేయించమని అడుగుతారా? అని మండిపడ్డారు. జగన్ పక్కనుండేది చెత్త సలహాదారులని, జగన్‌పై సీబీఐ కేసులు వచ్చేలా చేసిన వాళ్లే ఇప్పుడూ సలహాలిస్తున్నారని మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu