మాజీ ఎంపీ మానసిక రోగి

 

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మాజీ ఎంపీ మానసిక రోగిగా మారారా? మానసిక రోగులు ఎలా అదుపు లేకుండా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అంటున్నారు అధికార టీఆర్ఎస్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మానసిక రోగిగా మారడం వల్ల తమ పార్టీకి చెందిన మంత్రి జగదీష్ రెడ్డి మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అంటున్నారు. జగదీష్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఫీ రీ ఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడానికి కాలేజీల నుంచి 5 శాతం కమీషన్ తీసుకున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పొన్నం చేసిన ఈ ఆరోపణల మీద టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్ పైవిధంగా స్పందించారు. జగదీష్ గౌడ్ మీద మానసిక రోగిలాగా ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ వాటిని రుజువు చేయకపోతే ఆయన మీద క్రిమినల్ పెడతామని హెచ్చరించింది. మొత్తానికి పొన్నం ప్రభాకర్ మీదకి టీఆర్ఎస్ అదే పేరున్న కర్నె ప్రభాకర్ని వదిలింది. భలే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu