సాయిబాబా విగ్రహం నుంచి తేనె...
posted on Feb 23, 2015 7:46PM

ఢిల్లీలోని సిద్ధార్థ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లోని పూజాగదిలో ఒక పంచలోహాలతో చేసిన పెద్ద సాయిబాబా విగ్రహం వుంది. సాయిబాబా భక్తుడైన ఆ అధికారి ప్రతిరోజూ క్రమం తప్పకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటాడు. అయితే ఆదివారం నాడు పూజ చేయడం కోసం పూజాగదిలోకి వెళ్ళిన ఆశ్చ్యపోయాడు. కారణం... పూజాగదిలోని సాయిబాబా విగ్రహం కాలిలోంచి తేనెలాంటి ద్రవం బొట్లు బొట్లుగా కారుతోంది. ఆ ద్రవాన్ని రుచి చూస్తే అచ్చం తేనెలానే వుంది. దాంతో ఈ విషయం ఢిల్లీ అంతా వ్యాపించింది. సాయిబాబా భక్తులు ఈ వింత దృశ్యాన్ని చూడటానికి ఆ ఇంటి ముందు క్యూ కట్టారు. ఇదంతా సాయిబాబా మహిమేనని, ఆ ఇంటి ఓనర్ పూజలకు సాయిబాబా సంతుష్టుడై ఇలా తేనె కురిపిస్తున్నాడని భక్తి పారవశ్యంతో అక్కడకి వచ్చినవాళ్ళు చెప్పుకుంటున్నారు.